ఆలేరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షునిగా సాగర్ రెడ్డి

ఆలేరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షునిగా సాగర్ రెడ్డి

ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షునిగా కట్టెగొమ్ముల సాగర్ రెడ్డి బుధవారం నియమితులయ్యారు. నియామక పత్రాన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా సాగర్ రెడ్డి అందుకున్నారు. సాగర్ రెడ్డి గతంలో ఎంపీటీసీగా, పిఎసిఎస్ డైరెక్టర్ గా సేవలందించారు. నూతన పట్టణ అధ్యక్షునికి పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.