దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ ఔషధాల అమ్మకాల నిషేధించాలి

దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ ఔషధాల అమ్మకాల నిషేధించాలి

కెమిస్ట్ అండ్ డ్రగ్టిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కొండ విజయ్ కుమార్

మక్తల్ , మే 20 (ఆంధ్రప్రభ) మన సమాజంలో ఔషధాలు ప్రాణాలను కాపాడే సాధనాలు కానీ అవే సరైన నియంత్రణ లేకుండా విక్రయించబడితే ప్రాణాలకు ప్రమాదమవుతాయి ప్రస్తుతం ఆన్‌లైన్ ద్వారా మందుల విక్రయం వేగంగా పెరుగుతోంది దీనివల్ల కొంత సౌలభ్యం ఉన్నా, అనేక ప్రమాదాలు కూడా ఉన్నాయని వెంటనే ఆన్లైన్ ఔషధాలు అమ్మకాలను నిలిపివేయాలని
కెమిస్ట్ అండ్ డ్రగ్గోస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కొండ విజయ్ కుమార్ డిమాండ్ చేశారు.
ముఖ్యంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు సులభంగా అందుబాటులోకి రావడం చాలా ప్రమాదకరమని అన్నారు. నకిలీ మందులు, గడువు ముగిసిన మందులు, అధిక మోతాదులో మందుల వినియోగం వంటి సమస్యలు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్రీస్ అసోసియేషన్ పిలుపుమేరకు బుధవారం నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో మెడికల్ షాప్ లను స్వచ్ఛందంగా బంద్ పాటించారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఉన్న అనంతరం స్థానిక రోడ్డు భవనంల శాఖ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో యువతలో అవగాహన లేకపోవడం వల్ల ఆరోగ్య నష్టం ఎక్కువగా జరుగుతోందన్నారు.
ఇంకా అత్యంత ఆందోళన కలిగించే విషయం నశికారక మందుల వినియోగం కొన్ని మందులు మొదట నొప్పి తగ్గించే ఔషధాలుగా వాడినా, తర్వాత అవే వ్యసనంగా మారుతున్నాయన్నారు. యువత మానసిక ఒత్తిడి, స్నేహితుల ప్రభావం, ఆసక్తి కారణంగా ఈ మత్తు మందులకు బానిసలవుతున్నారు.
నశికారక మందులు మనిషి ఆరోగ్యాన్ని మాత్రమే కాదు — కుటుంబాన్ని, భవిష్యత్తును, సమాజాన్ని కూడా నాశనం చేస్తాయని అన్నారు. చదువు దెబ్బతింటుంది, నేరాలు పెరుగుతాయి, మానసిక ఆరోగ్యం క్షీణిస్తుంది. చివరకు వ్యక్తి జీవితం చీకటిలోకి వెళ్లిపోతుందన్నారు.అందుకే ప్రభుత్వం ఆన్‌లైన్ ఔషధాల అమ్మకాలపై కఠిన నియంత్రణలు తీసుకురావడం చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి మందు లైసెన్స్ ఉన్న ఫార్మసీల ద్వారా మాత్రమే విక్రయించాలని ఆవిధంగా ప్రభుత్వాలు చర్యలకు తీసుకోవాలని ఆయన కోరారు. డాక్టర్ సలహా లేకుండా మందులు కొనరాదన్నారు. ముఖ్యంగా యువతలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
మనమందరం కలిసి మందు ఆరోగ్యానికి — మత్తుకు కాదు అనే సందేశాన్ని సమాజానికి చేరవేయాల్సిన భాద్యత నేడు ప్రతి ఒక్కరిపై ఎంతైనా ఉందన్నారు. సమాజంలో మనుషుల జీవితాలను దెబ్బతీస్తున్న ఆన్లైన్ ఔషధ విగ్రహాలను తక్షణమే రద్దు చేయాలని కొండ విజయకుమార్ డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం తక్షణ చర్యలు చేపట్టాలని అందుకనే దేశవ్యాప్తంగా ఒకరోజు స్వచ్చంద బందు పాటిస్తున్నామని అన్నారు. తమ మెడికల్ షాపుల బందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు .ఈ విలేఖరుల సమావేశంలో కెమిస్ట్ అండ్ డ్రగ్గోస్ట్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఖాజా మైనొద్దీన్, మక్తల్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, సుధాకర్, ఉమాకాంత్ ,తాళంపల్లి అశోక్ కుమార్,వట్టం నాగేందర్, అగ్లార్ అశోక్ , కొత్తపల్లి రవికుమార్, మాగనూరు జగదీష్ తదితరులు పాల్గొన్నారు.