సంపూర్ణ మద్దతు తెలిపిన ఎల్కతుర్తి మండల కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్..
సంపూర్ణ మద్దతు తెలిపిన ఎల్కతుర్తి మండల కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్..
ఎల్కతుర్తి ,(ఆంధ్రప్రభ) : హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ పిలుపు మేరకు బుధవారం నిర్వహించిన 24 గంటల దేశవ్యాప్త బంద్‌లో భాగంగా మండలంలోని మెడికల్ దుకాణాలు స్వచ్ఛందంగా, సంపూర్ణంగా బంద్ నిర్వహించాయి.ఎల్కతుర్తి మండల కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు గొడిశాల కిషన్, నందనం రవి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆన్లైన్ ద్వారా మందులు విక్రయించవద్దని, డిస్కౌంట్ ల పేర్లతో నకిలీ మందుల విక్రయం అరికట్టాలని అన్నారు. దీనివల్ల చిన్న మెడికల్ షాపులు తీవ్రంగా నష్టపోతున్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న కెమిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ బంద్ నిర్వహించామని తెలిపారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి చిన్న వ్యాపారులను రక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మండలంలోని మెడికల్ షాపుల యజమానులు ఐక్యంగా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా పాల్గొనడం బంద్‌ను విజయవంతం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనగాని ప్రవీణ్ గొడిశాల కార్తీక్, తిరుపతి, చిర్ర ఉదయ్ చందర్ తదితరులు పాల్గొన్నారు.
