Tragic | 20మంది కూలీలకు గాయాలు

Tragic | 20మంది కూలీలకు గాయాలు

Tragic | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : అన్నమయ్య జిల్లాలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిన్నమండెం మండలం కురవపల్లి సమీపంలో కూలీలతో వెళ్తున్న బొలేరో వాహనం అదుపుతప్పి బోల్తాపడటంతో 20మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసుల వివరాల ప్రకారం.. కూలీలతో వెళ్తున్న బొలేరో వాహనం కురవపల్లి సమీపానికి చేరుకున్న సమయంలో అదుపుతప్పడంతో ప్రమాదం జరిగింది. ప్రమాద ధాటికి వాహనం పల్టీలు కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న వారు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులకు చికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.