హ్యాండ్ బోర్‌ను ప్రారంభించిన ఆత్రం సుగుణ..

జైనూర్, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అసిఫాబాద్ డిసిసి అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. ఆమె సోమవారం జైనూర్ మండలంలోని రాసిమెట్ట గ్రామ పంచాయతీ పరిధిలోని రోడ్‌గూడలో నూతన హ్యాండ్ బోర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఇటీవల గ్రామస్తులు తన దృష్టికి తెచ్చారని తాను సమస్యపై స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి గ్రామంలో హ్యాండ్ బోర్ ఏర్పాటు చేయించానని తెలిపారు.

ఈ సందర్భంగా రాసి మెట్ట సర్పంచ్ ప్రజలు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని సుగుణ పేర్కొన్నారు. గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉయిక చందు, ఉప సర్పంచ్ ఆత్రం జమున, గ్రామ పెద్దలు కుంరం దుందే రావు, కడం రాము గ్రామ పటేల్, కుంరం సోనేరావు, భూసిమెట్ట సర్పంచ్ దుర్వ సింధు తదితరులు పాల్గొన్నారు.