అచ్చంపేటలో ముమ్మరంగా ఇండ్ల గణన సర్వే

అచ్చంపేట, ఆంధ్రప్రభ ; అచ్చంపేట పట్టణంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇండ్ల గణన సర్వే ముమ్మరంగా కొనసాగుతోంది. పట్టణంలోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ ఎన్యూమరేటర్లు ప్రజల నుంచి వివిధ వివరాలను సేకరిస్తున్నారు. ఇళ్ల నిర్మాణ విధానం, ఫ్లోరింగ్‌, గోడలు, పైకప్పు రకం, మరుగుదొడ్డి సౌకర్యం, తాగునీటి వనరులు, వంటగది తదితర అంశాలకు సంబంధించిన మొత్తం 34 ప్రశ్నలకు సమాధానాలను నమోదు చేస్తున్నారు. ప్రజలు సరైన వివరాలు అందించి ప్రభుత్వ సర్వేకు సహకరించాలని అధికారులు కోరారు. ఈ సర్వేను మున్సిపల్ కమిషనర్ మురళి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో ఎన్యూమరేటర్ కవిత, సూపర్వైజర్లు బీచ్యా నాయక్‌, రామకృష్ణ, మాస్టర్ ట్రైనర్ శివ శ్రీనివాస్ తదితరులు పాల్గొని సర్వే ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.