రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ విద్యా కమిటీ చైర్మన్‌గా మాచిపెద్ది శివకుమార్

రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ విద్యా కమిటీ చైర్మన్‌గా మాచిపెద్ది శివకుమార్

సేవలకు గుర్తింపుగా కీలక బాధ్యతలు అప్పగింపు

నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ విద్యా కమిటీ నూతన చైర్మన్‌గా నాగర్‌కర్నూల్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్యవైశ్య సంఘం నాయకుడు మాచిపెద్ది శివకుమార్ ఎంపికయ్యారు.

ఈ మేరకు నియామక పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ చైర్మన్ అమరవాది లక్ష్మీనారాయణ తన కార్యాలయంలో శివకుమార్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి నూతన బాధ్యతలను అప్పగించారు.

మాచిపెద్ది శివకుమార్ పట్టణ, జిల్లా స్థాయిలో ఆర్యవైశ్య సంఘం కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ సేవలందిస్తున్నారు. ఆర్యవైశ్యులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తూ ముందుకు సాగుతున్నారు.

ఇటీవల అమరవాది లక్ష్మీనారాయణ రాష్ట్ర చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం, నాగర్‌కర్నూల్ జిల్లా మహాసభ ఎన్నికల నిర్వహణ చైర్మన్‌గా శివకుమార్‌ను నియమించారు. ఆ బాధ్యతల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా పర్యటించి మండల స్థాయి కార్యవర్గాల ఏర్పాటుకు కృషి చేశారు. అలాగే ఇటీవల నాగర్‌కర్నూల్ పట్టణ ఎన్నికల కన్వీనర్‌గా వ్యవహరిస్తూ ఆర్యవైశ్య సంఘం ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారు.

ఆయన సేవలు, సంఘం అభివృద్ధికి చేసిన కృషిని గుర్తించిన రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నాయకత్వం విద్యా కమిటీ చైర్మన్ పదవిని అప్పగించింది.

ఈ నియామకంపై ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులు, వ్యాపారవేత్తలు, ఆర్యవైశ్య సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

Leave a Reply