Utkur | దరఖాస్తుల ఆహ్వానం

Utkur | దరఖాస్తుల ఆహ్వానం
- గురుకులాల్లో ప్రవేశాల కోసం అప్లయ్ చేసుకోవాలి
- ప్రిన్సిపాల్ మంజుల
Utkur | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మంజుల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.100 రుసుము చెల్లించి ఆన్‌లైన్ ద్వారా వచ్చే నెల 21 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. దీంతో పాటు ఆరవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్నివిద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
