చౌటుప్పల్‌లో దాహార్తి తీర్చుతున్న చలివేంద్రం..
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : వేసవి తీవ్రత దృష్ట్యా చౌటుప్పల్ పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రయాణికులు, ప్రజల దాహార్తిని తీరుస్తూ అందరి మన్ననలు పొందుతోంది. చౌటుప్పల్ బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ దివంగత కాంగ్రెస్ నేత తాటి రామచంద్రం స్మారకార్థం ఆయన కుమారుడు తాటి వెంకటేశం ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రంలో నిర్వాహకుడు బోదుల శంకరయ్య ప్రతిరోజూ బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికులకు, దారిపొడవునా వెళ్లే ప్రజలకు చల్లటి నీటిని పంపిణీ చేస్తూ దాహం తీరుస్తున్నారు. ఎండ తీవ్రతకు అల్లాడిపోతున్న ప్రయాణికులతో పాటు విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది సైతం ఈ చలివేంద్రం ద్వారా ఉపశమనం పొందుతున్నారు. వేసవి కాలంలో ప్రజల అవసరాలను గుర్తించి ఇలాంటి సేవా కార్యక్రమం చేపట్టడం పట్ల స్థానికులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తూ నిర్వాహకులను అభినందిస్తున్నారు.
