41-44 degrees | తెలంగాణలో వచ్చే ఐదు రోజులు భగభగలే..
41-44 degrees | తెలంగాణలో వచ్చే ఐదు రోజులు భగభగలే..
41-44 degrees | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ర్టం నిప్పులకొలిమిని తలపిస్తోంది. ఎండల ప్రభావంతో అడుగు బయటపెట్టాలంటేనే జనం వణికిపోతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వచ్చే ఐదు రోజుల పాటు రాష్ట్రంలో భానుడి భగభగలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండల తీవ్రతతో వడగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ రోజు (ఆదివారం) ఐదు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. భానుడి భగభగల దృష్ట్యా ఇవాళ 16 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల్లో 41-44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. రేపు ఏడు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
CLICK HERE TO READ MORE : who I Global Emergency I 1976 I ఆంక్షలు వద్దు.. అప్రమత్తంగా ఉండాలి!
