Japan Visa Issues | కఠినతరమైన జపాన్ వీసా నిబంధనలు

Japan Visa Issues | కఠినతరమైన జపాన్ వీసా నిబంధనలు
Japan Visa Issues | జపాన్‌లో భారతీయ వ్యాపారులకు వీసా సమస్యలు
మనీష్ కుమార్ ఆవేదన
చిన్న వ్యాపారులపై కొత్త నియమాల ప్రభావం
జపాన్‌లో విదేశీయుల ఆందోళనలు
Japan Visa Issues | టోక్యో: జపాన్ దేశంలో మనీష్ కుమార్ అనే భారతీయుడు 30 సంవత్సరాలుగా నివసిస్తున్నారు. సైతామా ప్రాంతంలో 18 సంవత్సరాలుగా భారతీయ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. ఇటీవల జపాన్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఏజెన్సీ ఆయన బిజినెస్ మేనేజర్ వీసా పునరుద్ధరణను తిరస్కరించింది. దీంతో ఆయన రెస్టారెంట్ మూసివేయాల్సి వచ్చింది. దేశం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు.
గత సంవత్సరం జపాన్ ప్రభుత్వం బిజినెస్ మేనేజర్ వీసా నిబంధనలను కఠినతరం చేసింది. కనీసం మూడు కోట్ల యెన్ మూలధనం, పూర్తి సమయం జపాన్ పౌరుడిని ఉద్యోగిగా నియమించడం, భాషా నైపుణ్యం, ధృవీకరించిన వ్యాపార ప్రణాళిక వంటి కొత్త షరతులు విధించింది. చిన్న వ్యాపారులు ఈ నిబంధనలు తీర్చలేకపోతున్నారు.
మనీష్ కుమార్ కూడా ఈ కొత్త నియమాలకు అనుగుణంగా లేకపోవడంతో వీసా తిరస్కరణను ఎదుర్కొన్నారు. టోక్యోలో జరిగిన ఒక నిరసన సభలో మనీష్ కుమార్ కన్నీళ్లు పెట్టుకుని మాట్లాడారు. తాను 30 సంవత్సరాలుగా జపాన్ నియమాలు పాటిస్తూ కష్టపడి పని చేశానని, వాణిజ్య సంఘం, కస్టమర్ల మద్దతుతో ఇంతదూరం వచ్చానని చెప్పారు.
తన పిల్లలు జపాన్‌లోనే పుట్టి పెరిగారని, వారు జపాన్ భాష మాత్రమే మాట్లాడతారని, వారి స్నేహితులంతా జపానీయులేనని, ఇంటిని కూడా కొన్నానని తెలిపారు. ఇప్పుడు దేశానికి తిరిగి వెళ్లమని చెప్పడం ఎంత మానవీయమో ప్రశ్నించారు. ఈ సంఘటన జపాన్‌లోని చిన్న వ్యాపారులు, ముఖ్యంగా భారతీయులు, నేపాలీయులు, చైనా వంటి దేశాల వ్యాపారుల మధ్య ఆందోళన సృష్టించింది. అనేక మంది రెస్టారెంట్లు మూసివేయాల్సి వస్తోంది. వేలాది మంది ఈ కొత్త నిబంధనల సమీక్ష కోసం పిటిషన్ వేశారు. ఈ విషయం జపాన్‌లో పెద్ద చర్చనీయాంశం అయింది. మనీష్ కుమార్ కేసు విదేశీయుల జీవితాలపై కొత్త నియమాల ప్రభావాన్ని బయటపెట్టింది.
