కాంగ్రెస్ పార్టీ కడెం మండల అధ్యక్షుడిగా బొడ్డు గంగన్న ..

కడెం, ఆంధ్రప్రభ : నిర్మల్ డీసీసీ జిల్లా అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు పటేల్ ప్రతిపాదనల మేరకు ఖానాపూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నూతన మండల, పట్టణ అధ్యక్షులను నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ జాబితాను విడుదల చేశారు.

కాంగ్రెస్ పార్టీ కడెం మండల అధ్యక్షుడిగా నచ్చన్ ఎల్లాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ బొడ్డు గంగన్నను, కడెం టౌన్ అధ్యక్షుడిగా కడెంకు చెందిన ఎండి వాజిద్ ఖాన్‌ను నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు.

తమపై పూర్తి నమ్మకంతో అధ్యక్ష పదవులు అప్పగించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు పటేల్‌కు బొడ్డు గంగన్న, ఎండి వాజిద్ ఖాన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, కార్యకర్తల సంక్షేమానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు శ్రమిస్తామని బొడ్డు గంగన్న పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లి పార్టీ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు సహకరించాలని నూతన కడెం మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న కోరారు.