గోవుల అక్రమ రవాణా జరగకుండా చూడాలి

గోవుల అక్రమ రవాణా జరగకుండా చూడాలి

  • నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల

కడెం, ఆంధ్రప్రభ: నిర్మల్ జిల్లా కడెం మండలం పాండవపూర్ చెక్ వద్ద బక్రీద్ సందర్భంగా గోవులను తరలించకుండా ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీస్ బందోబస్తును జిల్లా ఎస్పీ జానకి షర్మిల సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఎస్సై సాయికిరణ్, పోలీస్ సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు చేశారు. బక్రీద్ సందర్భంగా గోవులను తరలించకుండా పకడ్బందీగా బందోబస్తు నిర్వహించాలని, గోవుల అక్రమ రవాణా జరగకుండా చూడాలని, అనుమానస్పదంగా వచ్చే గూడ్స్ వాహనాలను తనిఖీ చేయాలన్నారు. ఎలాంటి అక్రమ గోవుల రవాణా జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను ఎస్పీ జానకి షర్మిల కోరారు. ఈ తనిఖీలో కడెం ఎస్సై సాయికిరణ్, పోలీస్ సిబ్బంది హర్షద్ పాషా, ఆత్రం సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply