అలరించిన బ్రహ్మంగారి చరిత్ర

అలరించిన బ్రహ్మంగారి చరిత్ర

చౌటుప్పల్, ఆంధ్రప్రభ:
చౌటుప్పల్ గ్రామీణ కళల పరిరక్షణ సేవా సమితి 11వ వార్షికోత్సవం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ ప్రారంభోత్సవ వేడుకలు పట్టణ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ కచ్చేరి వద్ద సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’ యక్షగానం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

​రాత్రంతా మంత్రముగ్ధులైన ప్రేక్షకులు​చిట్టిప్రోలు వెంకటేశం పంతులు, ఎరుకల భాస్కర్ గౌడ్, తారమతి పంతులు గార్ల కళాబృందం ప్రదర్శించిన ఈ యక్షగాన భాగవతం అద్భుతంగా సాగింది. రాత్రి 8 గంటలకు ప్రారంభమైన ఈ ప్రదర్శన, తెల్లవారుజామున 7 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగింది. కళాకారుల వాచికం, అభినయం ప్రేక్షకులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది.

​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ అంతరించిపోతున్న ప్రాచీన గ్రామీణ కళలను కాపాడటంలో గ్రామీణ కళల పరిరక్షణ సేవా సమితి చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. సాంస్కృతిక వారసత్వాన్ని భావి తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి ప్రతినిధులు ​ఎరుకల మల్లేశం గౌడ్, ​పోలోజు శ్రీధర్ బాబు, ​దొడ్డి రాములు, పెద్ద సంఖ్యలో భక్తులు, కళాభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply