మహిళలతో నృత్యం చేస్తూ.. కౌన్సిలర్ అభ్యర్థి శ్రీకాంత్ గౌడ్ ప్రచారం..

మహిళలతో నృత్యం చేస్తూ.. కౌన్సిలర్ అభ్యర్థి శ్రీకాంత్ గౌడ్ ప్రచారం..
మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూరు మున్సిపాలిటీలో 9వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీకాంత్ గౌడ్ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా మహిళలతో కలిసి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తూ డాన్స్ చేశారు. వార్డులో నిత్యం ఇంటింటి ప్రచారంలో భాగంగా ఆత్మీయంగా ఓటర్లను పలకరిస్తూ ఆకర్షిస్తున్నారు. అన్నా మీ ఓటు మాకే … అక్క మీ మద్దతు నాకే … అవ్వ ఒకసారి అవకాశం ఇవ్వు అంటూ… ఆత్మీయ ప్రచారం నిర్వహిస్తున్నారు. తనకు ఒక్కసారి అవకాశం ఇచ్చి కౌన్సిలర్ గా గెలిపిస్తే 9 వవార్డు జామ చెట్ల బావి, కొండాపురం, మంగలిగడ్డ, గడి బజార్లలో పూర్తి స్థాయిలో సీసీ రోడ్డు, డ్రైనేజీలు ఏర్పాటు చేస్తానని, విద్యుత్ స్తంభాలు , వీధి దీపాలు, పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగునీటికి శాశ్వత పరిష్కారం కల్పిస్తామన్నారు.
మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని, 9వ వార్డులో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి పరచి.. మోత్కూర్ మున్సిపాలిటీలోనే 9 వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కనీసం బీటీ రోడ్డు మంజూరు చేయలేదని.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జామచెట్ల బావి నుండి కొండాపురం వరకు రూ.5 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. ఎల్లుండి జరిగే మున్సిపల్ ఎన్నికల్లో చేయి గుర్తు పై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో కౌన్సిలర్ గా గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.
