బాల్య మిత్రునికి ఆర్థిక సహాయం…

చిట్యాల, ఆంధ్రప్రభ ; బాల్య మిత్రుడు తమ తోటి చదువుకొని ఇటీవల అకాల మరణం చెందిన తోటి మిత్రుడి కుటుంబానికి పూర్వ విద్యార్థులు కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు. చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన సిలువేరు వెంకటేష్ ఇటీవల ఆకస్మికంగా మరణించడంతో, అతని కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఈ విషయం తెలుసుకున్న పదవ తరగతి 2006-2007 బ్యాచ్ విద్యార్థులు
​సోమవారం మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చి రూ. 56,000లు వెంకటేష్ కుటుంబానికి మిత్ర బృందం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆవుల రాము యాదవ్, ఊట్కూరి రమేష్, మాచర్ల యాదగిరి, ఆవనగంటి ఆంజనేయులు, తోటకూర మహేష్, మైల వేణు, ఆవనగంటి గణేష్ తదితర మిత్రులు పాల్గొన్నారు.