శివరామ ఆలయంలో మాస కళ్యాణోత్సవం..
మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని శ్రీ శివరామ ఆలయంలో ఈ రోజు మాస శివరాత్రి సందర్భంగా శివపార్వతుల మాస కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. అర్చకులు బొల్లోజు శ్రీకాంత్, తిరందాసు శ్రవణ్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించగా గ్రామస్థులు, భక్తులు పాల్గొన్నారు.
