రైస్ మిల్ ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్..

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి పట్టణంలోని అన్నపూర్ణ రైస్ మిల్ ను శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మిక తనిఖీ చేశారు. మిల్లులో ధాన్యం నిల్వలు, గతంలో ఇచ్చిన ధాన్యానికి సిఎంఆర్, ప్రస్తుత నిల్వలపై కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాతో కలిసి ఆరా తీశారు. కొనుగోలు కేంద్రాల నుండి వచ్చే ధాన్యాన్ని త్వరితగతిన అన్ లోడ్ చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన రైస్ మిల్లర్లు త్వరగా అన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట పలువురు అధికారులు ఉన్నారు.