వివరాలను పక్కగా నమోదు చేయాలి

వివరాలను పక్కగా నమోదు చేయాలి

కొత్తూరు తహసీల్దార్ ఎస్కే ముంతాజ్

కొత్తూరు, ఆంధ్రప్రభ: ఓటర్ల కుటుంబ సభ్యుల వివరాలను డేటా ఎంట్రి సిబ్బంది పక్కాగా నమోదు చేయాలని కొత్తూరు తహసీల్దార్ ముంతాజ్ అన్నారు. కొత్తూరు మండల కేంద్రంలోని కొత్తూరు తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో ముంతాజ్ అధ్యక్షతన బుధవారం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)-ఎలక్షన్ పై సూపర్వైజర్స్, జీపీవో, బీఎల్ వోలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఎల్వోలు తమ తమ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రతీ ఇంటికి వెళ్లి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు వివరాలను నమోదు చేయాలన్నారు. అంటే తల్లిదండ్రుల వివరాలు వయస్సు, వారి యొక్క ఎపిక్ కార్డు నెంబర్ ఎంట్రీ చేయాలన్నారు. అంతేకాకుండా వారిని వారి తల్లిదండ్రులతో మ్యాపింగ్ చేయాలి. మ్యాపింగ్ తర్వాత ప్రొవిజన్ కూడా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు డి. సంజీవ, దీప్తి, జీపీవోలు, బీఎల్వోలు పాల్గొన్నారు.

Leave a Reply