నా దేశం నా బాధ్యత అనే నినాదంతో ముందుకు సాగాలి
నా దేశం నా బాధ్యత అనే నినాదంతో ముందుకు సాగాలి
- మంత్రి కొల్లు రవీంద్ర
- ప్రజాదర్బార్ కార్యక్రమానికి సైకిల్ పై మంత్రి
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : ప్రజలందరూ నా దేశం నా బాధ్యత అనే నినాదంతో ముందుకు సాగాలని రాష్ట్ర గనులు భూగర్భనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు..కృష్ణాజిల్లా మచిలీపట్నంలో శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమానికి మంత్రి రవీంద్ర సైకిల్ పై వచ్చారు. ప్రధాని పిలుపుమేరకు ఆయన ఇంటి వద్ద నుంచి కార్యాలయానికి సైకిల్ మీద వచ్చి ప్రజానీకానికి తన సంకేతాన్ని అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యుద్ధ నేపథ్యంలో దేశంలో క్లిష్ట పరిస్థితులు ఎదురైతున్న దృష్ట్యా ముందస్తుగానే ప్రజల్ని అప్రమత్తం చేసిన ప్రధాని పిలుపును అందరూ గౌరవించాలన్నారు దానిలో భాగంగానే ఇందనంతో పాటు వంటనూనె గ్యాస్ తదితర ఖర్చులన్నింటిని పరిమితం చేసుకోవాలని కోరారు.
రాష్ట్రంలో ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం తమ కాన్వాయ్ లను తగ్గించుకొని ఖర్చును ఆదాసేస్తున్నట్టు తెలిపారు. దాంట్లో బాగానే ఈరోజు ప్రజా దర్బార్ కు సైకిల్ పై హాజరు కావడం జరిగిందన్నారు.

