సర్కార్ బడుల్లో నాణ్యమైన విద్య : స్పెషల్ ఆఫీసర్

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; సర్కార్ బడుల్లో ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందిస్తోందని కమ్మర్ పల్లి మండల ప్రత్యేక అధికారి రాజా గంగారం పేర్కొన్నారు. మంగళవారం కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని జడ్పిహెచ్ఎస్ పాఠశాల బడిబాట కార్యక్రమంలో ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్,సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్,ఉప సర్పంచ్ అశోక్, ఉపాధ్యాయులతో కలిసి బడిబాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.విద్యార్థులను పాఠశాలకు ఆకర్షించేందుకు ఉపాధ్యాయ బృందం ప్రత్యేక చర్యలు చేపట్టారు. గ్రామంలో పర్యటించి తమ పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు.విద్య ప్రాముఖ్యతను వివరించి పిల్లలను పాఠశాలకు పంపించాలని కోరారు.

ముఖ్యంగా ప్రభుత్వం పాఠశాలలో కల్పిస్తున్న ఉచిత పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫార్మ్స్, విజ్ఞాన యాత్రల గురించి వివరించి తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నారు.అలాగే చదువు మానేసిన విద్యార్థులను తిరిగి పాఠశాలలో చేర్పించడం పై ప్రత్యేక దృష్టి సారించారు.ప్రభుత్వం అమలు చేస్తున్న బడిబాట కార్యక్రమంలో ద్వారా పాఠశాలలో విద్యార్థుల నమోదు శాతం పెరుగుతుందని ఉపాధ్యాయులు ఆశ భావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయన్న, విడిసి చైర్మన్ మల్యాల సుభాష్ గౌడ్, ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.