ఉపాధి హామీ పనులను పరిశీలించిన స్పెషల్ ఆఫీసర్

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని పల్లె చెరువులో జరుగుతున్న పూడిక తీత పనులను మండల ప్రత్యేక అధికారి రాజ గంగారాం,ఎంపీడీవో చింతరాజ శ్రీనివాస్ తో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉపాధి హామీ పనులను కల్పించాలని, కూలీల సంఖ్య పెంచాలని, ప్రతికూలి కొలతల ప్రకారం పనిచేయాలని ఫీల్డ్ అసిస్టెంట్ కు సూచించారు. పనుల నాణ్యతను,మస్టర్ రోల్స్ ను పరిశీలించారు.

కూలీలకు మంచినీరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు.ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయమే పని ప్రదేశానికి చేరుకుని, సకాలంలో హాజరు నమోదు చేసుకోవాలని సూచించారు.కొలతల ప్రకారం పనులు చేసి గిట్టుబాటు కూలి పొందాలని కూలీలకు తెలిపారు. అనంతరం కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మీ రమ,మేట్లు,కూలీలు తదితరులు పాల్గొన్నారు.