క్రీడల్లో గెలుపోటములు సమానంగా స్వీకరించాలి..
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; క్రీడాకారులు క్రీడల్లో గెలుపోటములు సమానంగా స్వీకరించాలని ఓటమి గెలుపుకు నాంది పలుకుతుందని మాజీ మండల రైతుబంధుసమితి అధ్యక్షులు నర్సప్పోళ్ల సుధాకర్ రెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ రామ్ రెడ్డిఅన్నారు. మంగళవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని అమీన్ పూర్ లో దివంగత మాజీ సింగిల్ విండో చైర్మన్ నారాయణరెడ్డి జ్ఞాపకార్థం నిర్వహించిన క్రికెట్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటాలని అన్నారు. ప్రతినిత్యం క్రీడలు ఆడటం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వానికి ఎంతగానో దోహదపడుతుందనిఅన్నారు. క్రీడాకారులే నిజమైన ఆరోగ్యవంతులని యువత విద్యార్థులు క్రీడారంగంలో రాణించి తమ ప్రతిభను చాటి గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. క్రీడల్లో రాణిస్తేఉజ్వల భవిష్యత్తు ఉంటుందని క్రీడాకారులకు తమ వంతు సహకారం ఉంటుందన్నారు.
అనంతరం ప్రథమ బహుమతి దివంగత మాజీ విండో చైర్మన్ నారాయణరెడ్డి జ్ఞాపకార్థం ప్రథమ బహుమతి రూ. 22222 ఆయన కుమారులు శివారెడ్డి, సుధాకర్ రెడ్డి రామ్ రెడ్డి అందజేయగా ద్వితీయ బహుమతి దివంగత మొగులప్ప స్మారకార్థం ఆయన కుమారుడు కృష్ణయ్య గౌడ్ రూ.12111 నగదు అందజేయగా ఎండిసాఫీమెమోటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగేష్, ఉప సర్పంచ్ రవీందర్ రెడ్డి, ఒబ్లాపూర్ మాజీ సర్పంచ్ భీం రెడ్డి, నాయకులు గ్రామస్తులు శేఖర్ రెడ్డి కృష్ణయ్య గౌడ్, దొబ్బలి రమేష్ , శేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
