గ్రంధాలయాలను సద్వినియోగం చేసుకోవాలి..
గ్రంధాలయాలను సద్వినియోగం చేసుకోవాలి..
- గ్రంథాలయాధికారి శ్రీనివాసరావు..
శావల్యాపురం, ఆంధ్రప్రభ : విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని గ్రంథాలయాధికారి రావూరి శ్రీనివాసరావు అన్నారు. వేసవి విజ్ఞాన శిక్షణ కార్యక్రమంలో భాగంగా శావల్యాపురం సెంటర్లోని గ్రంథాలయంలో మంగళవారం విద్యార్థులతో పుస్తక పఠనం వలన ఉపయోగాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులకు క్విజ్, డిబేట్, చిత్రలేఖనం, వ్యాస రచన పోటీలు నిర్వహించారు.
గ్రంథాలయాధికారి మాట్లాడుతూ విద్యార్థులు వెనుకబడిన సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టిపెట్టి పట్టును సాధించేందుకు విజ్ఞాన శిబిరాలు దోహదపడుతాయన్నారు. ఉపాధ్యాయులు శ్రీనివాస్ సింగ్, చెన్ను బాబు తదితరులు పాల్గొన్నారు.
