తమిళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు

తమిళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాజకీయంగా కీలక భేటీలను కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వివిధ పార్టీల సీనియర్ నేతలను కలుస్తున్న విజయ్.. తాజాగా పీఎంకే నాయకుడు అన్బుమణి రామదాస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ తమిళ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అన్బుమణి రామదాస్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన విజయ్‌కు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా విజయ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రమాణ స్వీకారానికి ముందు, తర్వాత వివిధ రాజకీయ పార్టీల నేతలను విజయ్ కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పరిపాలనలో సమ్మతి, సమన్వయం సాధించాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ భేటీలు కొనసాగిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.