వాల్ పోస్టర్ ఆవిష్కరణ…
చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని తిర్మలాపూర్ గ్రామానికి చెందిన వర్ధమాన గేయ రచయిత ,దాసారపు నరేష్, రచించిన పురిటి నొప్పులు పాట సోమవారం మండల ఎంపిడిఓ, టి.జయశ్రీ, చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరించారు . అనంతరం ఆమె మాట్లాడుతూ అమ్మని మించిన దైవం లేదని, సృష్టికి జీవం పోసి నవమాసాలు మోసి, జగతినీ చూపించి కమ్మని ప్రేమను పంచి మనకు బతుకు బాటను చూపే తల్లి మనం ఎన్ని జన్మలు ఎత్తిన అమ్మ ఋణం తీర్చుకోలేమన్నారు.
అమ్మను ప్రేమించాలని,కన్నందుకు అమ్మ ప్రేమను మరువద్ద న్నారు. అమ్మపాటను, పాడిన అనితను ఇంకా ఎన్నో పాటలు పాడాలని, మంచి పేరు పొందాలని ఎంపిడిఓ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిఓ .ఏ రామకృష్ణ టైపిస్ట్ పుల్ల ప్రభాకర్ , తిరుమలపూర్ కార్యదర్శి రాజేష్ , మిట్టపేల్లి మిత్రమండల అధ్యక్షులు పుల్ల సతీష్ కుమార్ ,గాయకులు పుల్ల ప్రతాప్, జీడి సంపత్, మొగిలి, తదితరులు పాల్గొన్నారు.
