యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కిరణ్ కుమార్..

బిక్కనూర్, ఆంధ్రప్రభ ; బిక్కనూరు మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ధ్యాగల కిరణ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మధుసూదన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అట్టి నియామక పత్రాన్ని సోమవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ చేతుల మీదుగా అందజేశారు.

మండలంలో యువజన కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కిరణ్ కుమార్ చేసిన సేవలను గుర్తించి ప్రధాన కార్యదర్శిగా నియమించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమపై నమ్మకంతో అప్పగించిన పదవికి తగిన న్యాయం చేస్తానని తెలిపారు. ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయడం జరుగుతుందన్నారు . తమ నియమకానికి కృషి చేసిన నాయకులకు ఎంతో రుణపడి ఉంటానని చెప్పారు.

Leave a Reply