వేసవి శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించిన -చైర్మన్ పందిరి గీత
వేసవి శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించిన -చైర్మన్ పందిరి గీత
చిట్యాల ,ఆంధ్రప్రభ: వేసవిలో విద్యార్థులకు పలు విభాగాలలో అందిస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలి అని చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీత అన్నారు. చిట్యాల ప్రభుత్వ పాఠశాలలో సోమవారం వేసవి శిబిరాన్ని ఆమె వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం చైర్మన్ గీత మాట్లాడుతూ విద్యార్థులకు ఈరోజు నుండి మే 25 వరకు 15 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాఠ్య పుస్తకాలతో పాటు విద్యార్థులకు యోగా, వ్యాయామం ,క్రీడలు , కంప్యూటర్ శిక్షణ, మెడిటేషన్ వాటిని నేర్పిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాధికారి సైదా నాయక్ ఉపాధ్యాయులు బోడ సుశీల పాల్గొన్నారు.
