సోదర భావంతో పండుగలు జరుపుకోవాలి..

సోదర భావంతో పండుగలు జరుపుకోవాలి..

గోవులఅక్రమ రవాణాపై పోలీసులప్రత్యేక నిఘా.
మక్తల్ సీఐ రామ్ లాల్.

ఊట్కూర్, ఆంధ్రప్రభ : పండగలు సోదర భావంతో జరుపుకోవాలని మక్తల్ సిఐరామ్ లాల్ సూచించారు. గోవుల అక్రమ రవాణాపై పోలీసులు ప్రత్యేకంగానిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు రానున్న బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని అన్నారు. సోమవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ పోలీస్ స్టేషన్‌లో హిందూ, ముస్లిం మత పెద్దలతో మక్తల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామ్ లాల్, ఎస్సై రమేష్, పశు వైద్యాధికారులు మానస, సాయి వరుణ్ లు శాంతి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఐమాట్లాడుతూగోవుల అక్రమ రవాణాపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎవరైనా గోవులను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
అలాగే, చట్టాన్ని ఎవరూ చేతిలోకి తీసుకోరాదని, అనుమానితులతో గొడవలకు దిగకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. గోవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు సమిస్తాపూర్ బోర్డర్ చెక్పోస్ట్ వద్ద నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పశువుల రవాణా చేసే సమయంలో వాటికి సంబంధించిన పత్రాలు కచ్చితంగా కలిగి ఉండాలని సూచించారు.

బక్రీద్ పండుగ సందర్భంగా పరస్పర సహకారం, సోదరభావంతో వ్యవహరించి తమ పండగలను నిర్వహించుకోవాలని అలాగే శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరారు.ఈ సమావేశంలో మాజీ జెడ్పిటిసి సూర్యప్రకాశ్ రెడ్డి, జిల్లా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు భరత్, మాజీ ఉపసర్పంచ్ ఇబాదూర్ రెహమాన్, ఆయా మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.