పీఎంజే జ్యువెలర్స్ చోరీ కేసులో పురోగతి..

కరీంనగర్ క్రైమ్, ఆంధ్రప్రభ ; రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎం జ్యువెలర్స్ చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. చోరీకి పాల్పడిన నిందితుల్లో ఒకరిని బీహార్ లో కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు చోరీలో ఆరుగురు నిందితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించిన కేసు విచారణలో భాగంగా నిందితులు పెరిగే అవకాశం ఉంది. నిందితులకు వెపన్స్ ఎవరు అందించాలని విషయంలో సైతం కరీంనగర్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.