ప్రధాని నరేంద్ర మోదీ సభను విజయవంతం చేద్దాం

ప్రధాని నరేంద్ర మోదీ సభను విజయవంతం చేద్దాం

  • కేసముద్రం మండల బీజేపీ అధ్యక్షుడు ఉప్పునూతుల రమేష్

కేసముద్రం, ఆంధ్రప్రభ : నేడు హైదరాబాద్ లోనీ పేరేడు గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే బహిరంగ సభను భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కేసముద్రం మండల బీజేపీ అధ్యక్షుడు ఉప్పునూతుల రమేష్ పిలుపునిచ్చారు. శనివారం ఓ ప్రకటన విడుదల చేస్తూ మాట్లాడారు. కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాలు, మండలంలోని గ్రామం నుండి భాజపా నాయకులు, కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.

పేరేడు గ్రౌండ్ లక్ష్యం ప్రధాని మోదీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. దేశాభివృద్ధిలో ప్రధాని మోదీ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడానికి ఈ సభ ఒక వేదిక అని, క్రమశిక్షణతో, ఉత్సాహంతో అందరూ పాల్గొని తెలంగాణ భవిష్యత్తు కోసం ఈ సభను చారిత్రాత్మక విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.