ఖమ్మంలో అభివృద్ధి దూకుడు

ఖమ్మంలో అభివృద్ధి దూకుడు

  • మంత్రి తుమ్మల దిశానిర్దేశంతో ప్రగతి పథం
  • 20 ఎకరాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయానికి మంత్రివర్గ ఆమోదం
  • మూడున్నరేళ్ళలో రూ.100 కోట్ల అభివృద్ధి పనులు
  • మేయర్‌ పునకొల్లు నీరజ, కార్పొరేటర్‌ రావూరి కరుణ సైదుబాబు

ఖమ్మం, ఆంధ్రప్రభ: ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముందుచూపు, కార్యదక్షతతో అభివృద్ధి దూసుకెళ్తోందని నగర మేయర్‌ పునుకొల్లు నీరజ, 15వ వార్డు సభ్యులు రావూరి కరుణా సైదుబాబు పేర్కొన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత మూడున్నర సంవత్సరాల్లో సుమారు రూ.100 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. నగర అవసరాలను ముందుగానే అంచనా వేసి ప్రణాళికలు రూపొందించడమే విజయానికి కారణమని చెప్పారు. ప్రతి వర్గానికి ప్రయోజనం చేకూరేలా పనులు అమలు చేస్తున్నారని వివరించారు. మౌలిక సదుపాయాల విస్తరణలో మంత్రి తుమ్మల ప్రత్యేక దృష్టి పెట్టారని పేర్కొన్నారు. అభివృద్ధి పనులను క్రమం తప్పకుండా సమీక్షిస్తూ వేగవంతం చేస్తున్నారని తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడుతున్నాయని చెప్పారు. తుమ్మల పట్టు-దల వల్లే ఈ మార్పు సాధ్యమైందని స్పష్టం చేశారు.

టీటీడీ దేవాలయం… ఖమ్మానికి ప్రతిష్ఠాత్మక గుర్తింపు..

ఖమ్మం నగరంలో టీ-టీ-డీ ఆధ్వర్యంలో 20 ఎకరాల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మేయర్‌ పునుకొల్లు నీరజ, రావూరి కరుణా సైదుబాబు తెలిపారు. ఈ ఆలయం నగరానికి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా నిలుస్తుందని పేర్కొన్నారు. భారీ స్థాయిలో భక్తులను ఆకర్షించే ఆధ్యాత్మిక కేంద్రంగా ఇది అభివృద్ధి చెందనుందని చెప్పారు. ఆలయ నిర్మాణంతో పర్యాటక రంగానికి ఊతం లభిస్తుందని వివరించారు. స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా ఇది దోహదపడనుందని అన్నారు. టీటీడీ ప్రమాణాలతో నిర్మాణం జరగనుందని తెలిపారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌ కోసం మంత్రి తుమ్మల ప్రత్యేకంగా కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన ముందుచూపు వల్లే ఖమ్మానికి ఈ గౌరవం దక్కిందని తెలిపారు.

డీఎప్టీn ప్రాజెక్ట్‌… ఇంటికే మినరల్‌ నీరు..
దేశంలోనే తొలిసారిగా డీఎప్టీn (డ్రింక్‌ ఫ్రమ్‌ టాప్‌) ప్రాజెక్ట్‌ ఖమ్మంలో ప్రారంభం కానుందని మేయర్‌ పునుకొల్లు నీరజ,రావూరి కరుణా సైదుబాబు వెల్లడించారు. ఈ పథకం ద్వారా ట్యాప్‌ తిప్పగానే నేరుగా మినరల్‌ నీరు అందనుందని తెలిపారు. మొదటగా 15వ డివిజన్‌ పరిధిలో ఈ ప్రాజెక్ట్‌ అమలు చేయనున్నట్లు- చెప్పారు. అమృత్‌ పథకం, మునిసిపల్‌ నిధులతో వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణం చేపడుతున్నట్లు- పేర్కొన్నారు. వేలాది కుటు-ంబాలకు శుద్ధి చేసిన తాగునీరు అందనుందని వివరించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఇది కీలక అడుగని అన్నారు. ఆధునిక సాంకేతికతతో నీటి శుద్ధి వ్యవస్థ ఏర్పాటు- చేస్తున్నారని తెలిపారు. దేశానికి ఆదర్శంగా నిలిచే ప్రాజెక్ట్‌గా ఇది మారనుందని చెప్పారు. ఈ ప్రణాళిక కూడా మంత్రి తుమ్మల దూరదృష్టి ఫలితమేనని స్పష్టం చేశారు.

రూ.100 కోట్లతో మౌలిక సదుపాయాల విస్తరణ..
నగరంలో రూ.100 కోట్లకు పైగా నిధులతో డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్‌ రంగాల్లో పనులు కొనసాగుతున్నాయని మేయర్‌, రావూరి కరుణా సైదుబాబు తెలిపారు. కొత్తగూడెం స్కూల్‌ నుంచి ఎస్సీ కాలనీ వరకు రూ.50 లక్షలతో డ్రైన్‌ నిర్మాణం చేపట్టినట్లు- చెప్పారు. పశువుల ఆసుపత్రి నుంచి బస్తీ దవాఖానా వరకు డ్రైనేజీ పనులు జరుగుతున్నాయని వివరించారు. పలు ప్రాంతాల్లో బీటీ-, సీసీ రోడ్లు నిర్మాణం వేగంగా కొనసాగుతోందన్నారు. పీబీ నగర్‌లో విద్యుత్‌ సౌకర్యం కల్పించారని తెలిపారు. 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌ నిర్మాణం కూడా చేపట్టినట్లు- పేర్కొన్నారు. ఎన్‌టీ-ఆర్‌ విగ్రహం నుంచి ఎన్‌ఎస్‌పీ కాల్వ వరకు సీసీ డ్రైన్‌ ఏర్పాటు- చేస్తున్నారని చెప్పారు. నగర మౌలిక వసతులు బలోపేతం అవుతున్నాయని వివరించారు. ఈ పనులన్నీ మంత్రి తుమ్మల పర్యవేక్షణలోనే జరుగుతున్నాయని స్పష్టం చేశారు.

పేదలకు గృహాలు… సమగ్ర అభివృద్ధి దిశగా అడుగులు..
పేదల కోసం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి త్వరలో పంపిణీ చేయనున్నట్లు మేయర్‌ పునుకొల్లు నీరజ, రావూరి కరుణా సైదుబాబు తెలిపారు. ఎస్సీ కాలనీలలో సీసీ రోడ్లు, యూజీడీ పనులు చేపట్టినట్లు చెప్పారు. గాంధీ బొమ్మ సెంటర్‌ నుంచి వైకుంఠ ధామం వరకు సీసీ రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణం జరుగుతోందన్నారు. వైకుంఠ ధామం, కబేళా స్థలం వంటి సౌకర్యాలు అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. స్కూల్‌ భవనాలు నిర్మాణంతో విద్యా రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు- తెలిపారు. పుట్టకోట ప్రాంతంలో ఎస్టీపీ ప్లాంట్‌ ఏర్పాటు- చేస్తున్నారని చెప్పారు. పుట్టకోట నుంచి అల్లిపురం వరకు బీటీ- రోడ్లు నిర్మాణం కొనసాగుతోందన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర అభివృద్ధి జరుగుతోందని వివరించారు. ఈ మార్పుకు మంత్రి తుమ్మల పట్టు-దలే కారణమని తెలిపారు.

తుమ్మల ముందుచూపుతో ఖమ్మం కొత్త దశలోకి..
ఖమ్మం నగర అభివృద్ధిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక పాత్ర పోషిస్తున్నారని మేయర్‌ పునుకొల్లు నీరజ, రావూరి కరుణా సైదుబాబు పేర్కొన్నారు. ముందుచూపుతో ప్రణాళికలు రూపొందించడం ఆయన ప్రత్యేకతగా తెలిపారు. ప్రతి పనిని సమయానికి పూర్తి చేయడంలో కార్యదక్షత చూపుతున్నారని చెప్పారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించే నాయకుడిగా ఆయన నిలిచారని వివరించారు. అభివృద్ధి పనుల్లో పారదర్శకత పాటిస్తున్నారని పేర్కొన్నారు. ఖమ్మాన్ని దేశానికి ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. టీ-టీ-డీ దేవాలయం, డీఎప్టీn వంటి ప్రాజెక్టులు ఆయన దూరదృష్టికి నిదర్శనమని చెప్పారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా అభివృద్ధి కొనసాగుతోందన్నారు. తుమ్మల నాయకత్వంలో ఖమ్మం కొత్త శకానికి నాంది పలుకుతోందని స్పష్టం చేశారు.

ఖమ్మం నగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి ఆమోదం తెలిపిన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు, టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడుకు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులకు 15వ డివిజన్‌ కార్పొరేటర్‌ రావూరి కరుణసైదుబాబులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో ఆలయ నిర్మాణానికి ఆమోదం తెలిపారు.