పశువుల అక్రమ రవాణా.. 45 ఆవు దూడల పట్టివేత
పశువుల అక్రమ రవాణా.. 45 ఆవు దూడల పట్టివేత
తిరుమలగిరి, ఆంధ్రప్రభ : మూగ జీవాలను అమానుషంగా లారీలలో కుక్కి ఊపిరాడకుండా గోస పెడుతూ తరలిస్తున్నారు. మనుషులలో మానవత్వం మంట కలిసి పోతుంది. పశు సంపదను నాశనం చేస్తున్నారు. లారీలో తరలిస్తున్న మూగజీవాలను చూస్తే మనసు చలించిపోతుంది. ఇంత దారుణంగా హింసించడం కర్కశత్వం… అక్రమంగా 45 ఆవు దూడలను లారీలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసిన సంఘటన చోటుచేసుకుంది.
సూర్యాపేట జిల్లా నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. అక్రమ రవాణా నిర్మూలన లక్ష్యంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 7 అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లా పోలీస్ చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ఏర్పాటులో భాగంగా తిరుమలగిరి మండలంలోని వెలిశాల వద్ద అంతర్ జిల్లా చెక్‌పోస్ట్ ను ఏర్పాటు చేయగా ఉదయం చెక్ పోస్ట్ వద్దా తనిఖీలు నిర్వహిస్తుండగా రాజమండ్రి నుంచి వస్తున్న లారీలో 45 ఆవు దూడలు తరలిస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. వాటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అక్రమ రవాణా వెనుక ఎలాంటి వ్యక్తులు ఉన్న ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
