10వ తరగతి విద్యార్థులకు ఘనంగా సన్మానం…

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : ఇటీవల వెలువడిన పదవ తరగతి పరీక్షలలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులైన భీమ్‌గల్ మండల్ చేంగల్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులను పాఠశాల ఆధ్వర్యంలో బుధవారం పాఠశాలలో అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ దుమాల మమత (రాజు)హాజరై వారి సంత డబ్బులతో పాఠశాల టాపర్ గా నిలిచిన విద్యార్థిని విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయ బృందం తో కలిసి వారి చేతుల మీదుగా శాలువా పూలమాల అలాగే డైరీలను అందజేసి ఘనంగా సన్మానించి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉత్తమ ఫలితాలు సాధించడం అభినందనీయం పదో తరగతి ఫలితాల్లో పాఠశాల నుండి ఫస్ట్ క్లాస్ గా వచ్చిన ఆదర్శ్ 535/- మార్కులు, సెకండ్ క్లాస్ గా వచ్చిన స్వాతిక 534/-మార్కులు, అలాగే మిగతా విద్యార్థులు కూడా మంచి మంచి మార్కులు సాధించి గ్రామాని కి మంచి పేరు సాధించారని ఆశాభవం వ్యక్తం చేశారు. ఇలాగే ముందుకు వెళ్లి ఉన్నత లక్ష్యాలు సాధించి గ్రామానికి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువచ్చి గుర్తింపు పొందాలని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం, పంచాయతీ సెక్రెటరీ ప్రతీప్,ఉప సర్పంచ్ నాతి మోహన్ గౌడ్, పాలకవర్గం సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
