హనుమాన్ నామస్మరణ తో మార్మోగిన భీమారం

హనుమాన్ నామస్మరణ తో మార్మోగిన భీమారం
భీమారం, మే 4,(ఆంధ్ర ప్రభ ) గ్రేటర్ పరిధిలోని 55 డివిజన్ బీమారం లో ఆదివారం రాత్రి హనుమాన్ నామస్మరణతో మార్మోగింది. భీమారం తటాక ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ దీక్ష తీసుకున్న దీక్షాపరులు, హనుమాన్ భక్తులు గురు స్వామి కొండం రాజయ్య యాదవ్ ఆధ్వర్యంలో సుమారు 70మంది స్వాములు ఆదివారం రాత్రి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా స్వాములు హనుమాన్, కాషాయ జెండాలు చేత బుని హనుమాన్ నామస్మరణతో భీమారంలోని రోడ్లపై ర్యాలీ నిర్వహించారు.
