రాయపర్తి, మైలారంలో పోలీసుల విస్తృత పెట్రోలింగ్

రాయపర్తి, మైలారంలో పోలీసుల విస్తృత పెట్రోలింగ్

  • ద్విచక్ర వాహనాలపై రెండు గ్రామాల్లో గస్తీ నిర్వహించిన ఎస్సై ముత్యం రాజేందర్
  • నేరాల నియంత్రణ, శాంతిభద్రతలే లక్ష్యంగా పోలీసుల పర్యటన

రాయపర్తి, ఆంధ్రప్రభ : రాయపర్తి మండల కేంద్రంతో పాటు మైలారం గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు ఆదివారం విస్తృతంగా పెట్రోలింగ్ నిర్వహించారు. రాయపర్తి ఎస్సై ముత్యం రాజేందర్ తన సిబ్బందితో కలిసి ద్విచక్ర వాహనాలపై రెండు గ్రామాల్లో గస్తీ తిరిగారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే రాయపర్తి మండల కేంద్రంలోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్ ఏరియా, మార్కెట్ ప్రాంతాలతో పాటు మైలారం గ్రామంలోని రహదారులు, శివారు ప్రాంతాలు, నిర్మానుష్య ప్రదేశాల్లో ఎస్సై సిబ్బందితో కలిసి విస్తృతంగా పెట్రోలింగ్ చేపట్టారు. అనుమానిత వ్యక్తుల కదలికలను నిశితంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎస్సై ముత్యం రాజేందర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ పోలీసుల ప్రథమ కర్తవ్యం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పగలు, రాత్రి తేడా లేకుండా గస్తీ నిర్వహిస్తున్నాం. గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు, అనుమానితులు వస్తే వెంటనే డయల్ 100కు లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. రెండు గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పని తీరును పరిశీలించారు. 24 గంటల నిఘా కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ పెట్రోలింగ్‌లో ఎస్సై ముత్యం రాజేందర్ తో పాటు రాయపర్తి పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీసుల నిరంతర గస్తీతో గ్రామాల్లో భద్రతా భావం పెరిగిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.