పందుల దాడిలో వరి ధ్వంసం

పందుల దాడిలో వరి ధ్వంసం

జన్నారం,ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని తపాల్ పూర్ వాసి జెల్ల భీమయ్య వరి పంటను శనివారం రాత్రి అడవి పందులు దాడి చేసి ధ్వంసం చేశాయి. తనకున్న 2 ఎకరాల పొలంలో వరి పంట వేశారు.ప్రస్తుతం ఆ పంట కోసే దశలో అడవి పందుల గుంపు మూకుమ్మడిగా ఆ పంటను ధ్వంసం చేశాయి.దీంతో పొలంలోని ఆ వరి పంట అంతా నీలమట్టమైంది. అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకొని పరిహారం ఇప్పించాలని ఆ రైతు భీమయ్య కోరారు.

Leave a Reply