అంగన్వాడి లబ్ధిదారులకు సరుకులు అందజేత
కడెం, ఆంధ్రప్రభ ; కడెం మండలం పెద్ద బెల్లాల్ అంగన్వాడి కేంద్రంలో శనివారం ప్రభుత్వం నుండి మంజూరైన పాల ప్యాకెట్లు బియ్యం బాలమృతం ప్యాకెట్లు లబ్ధిదారులకు పెద్ద బెల్లాల్ గ్రామ సర్పంచ్ ఈదుల తిరుపతి అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఈదుల తిరుపతి ప్రభుత్వం అంగన్వాడి కేంద్రం ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్న పౌష్టికాహారం సరుకులను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక అంగన్వాడి కేంద్రం టీచర్ షహనాజ్ బేగం, యూత్ సభ్యులు, లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
