చలివేంద్రాలలో చల్లని త్రాగునీరుతో పాటు మజ్జిగ సరఫరా..
ఇటిక్యాల, ఆంధ్రప్రభ : వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చడానికి అల్లంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్( SAR) ఎస్ ఏ ఆర్ అనే ఒక ఫౌండేషన్ ని ప్రజా సేవ కొరకు స్థాపించి. ఫౌండేషన్ ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం లో దాదాపు 20 కి పైగా ఎస్ ఏ ఆర్ ఫౌండేషన్ చలివేంద్రాలను నియోజకవర్గం అంతట ఏర్పాటు చేసే కార్యక్రమం గురువారం చేపట్టారు. అందులో భాగంగా ఎర్రవల్లి మండలకేంద్రంలోని 44వ జాతీయ రహదారి కూడలి చౌరస్తా పక్కనమాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ ఎస్.ఏ.సంపత్ కుమార్ చలివేంద్రాని ప్రారంభించి, వాహనదారులు, ప్రయాణికులు బాటసారిలకు మజ్జిగ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ.. మానవ సేవే మాధవ సేవగా భావించి వేసవిలో జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు, ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ చలివేంద్రాలను నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసి ప్రారంభించినట్లు తెలిపారు. ముఖ్యంగా ఈ చలివేంద్రాల వద్ద చల్లని త్రాగునీటితోపాటు వేసవికాలం అంతా కూడా మజ్జిగ పంపిణీ ఉంటుందని అన్నారు.ఎండ తాకిడి నుంచి ప్రజలు తమను తాము రక్షించుకోవాల్సిందిగా వారికి సూచిస్తూ ప్రజా శ్రేయస్సుకు ప్రజాసేవకు ఎల్లవేళలా ముందుంటానని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప, కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, డిసిసి ఉపాధ్యక్షులు నర్సిరెడ్డి, డిసిసి కార్యదర్శి మధు నాయుడు, వివిధ గ్రామాల సర్పంచులు రేణుకా బిసన్న, రవి ప్రకాష్, మద్దిలేటి యాదవ్, లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ లు జయ చంద్రారెడ్డి, రాముడు, పల్లె నిర్మల రాజు, జోగుల రవి, జైపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,తిమ్మారెడ్డి, నారాయణ నాయుడు, ఇటిక్యాల, ఎర్రవల్లి మండలాల మైనార్టీ సెల్ అల్లా బకాష్, గార్లపాడు అల్లా బకాష్, ఉమాపతి నాయుడు, ప్రభాకర్, ఈదన్న నాయుడు, పాలభిసన్న,మండల ఉపాధ్యక్షులు వెంకటేష్, ఎర్రవల్లి మండల వివిధ గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
