ఎల్లమ్మ, కంఠమహేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు

ఎల్లమ్మ, కంఠమహేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు


-ఐదు రోజుల మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
-తోరణాలంకరణతో ప్రారంభకానున్న ఆధ్యాత్మిక వేడుకలు
-బోనాలు, అభిషేకాలతో వైభవంగా జరగనున్న ఉత్సవాలు
-భక్తులతో కళకళలాడనున్న మహోత్సవాలు
-భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించిన ఉత్సవ కమిటీ

స్టేషన్ ఘన్ పూర్ , ఆంధ్రప్రభ:

స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఛాగల్ గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవత, జమదగ్ని శ్రీ కంఠమహేశ్వర స్వామి, సురమాంబ దేవి ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. గౌడ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఐదు రోజు లపాటు జరిగే ఈ మహోత్సవాలకు గ్రామం మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోయింది. మహోత్సవాల ప్రారంభానికి ముందు దేవాలయం పరిసరాలను అందంగా తోరణాలంకరణతో అలంకరించారు.

-ఏప్రిల్ 30గురువారం(రేపు )తోరణాలంకరణతో ప్రారంభమై..

ఈ మహోత్సవాలు ఏప్రిల్ 30 గురువారం తోరణాలంకరణతో ప్రారంభమవుతాయి. గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమా లు నిర్వహించనున్నారు. సాయంత్రం 6గంటలకు దీపారాధనతో భక్తి పరవశం అలుముకుంటుంది. మే1న శుక్రవారం ప్రధాన ప్రతిష్ఠాపన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. మే2 శనివారం ఉదయం జోగు ఎత్తుట, పుట్టధ్వని సంప్రదాయ కార్యక్రమాలు గ్రామం లో ఆధ్యాత్మిక శోభను పెంచనున్నాయి. మే3న ఆదివారం ఉదయం జలబిందల అభిషేకం, సాయంత్రం పోచమ్మ బోనాలు నిర్వహిస్తారు. మే 4 సోమ వారం ఎల్లమ్మకు బోనాలు, వనం ఎల్లమ్మకు బోనాలు, కళ్యాణ కార్య క్రమం జరుగనుంది. మహోత్సవాల చివరి రోజు మే 5న తెల్లవా రుజామున మత్త గావు, బలి ప్రదానం కార్యక్రమాలతో పాటు, అనంత రం ఉదయం11గంటలకు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు..

ఇక కాటమయ్య పండుగను పురస్కరించుకుని గ్రామమంతా రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ ఐదు రోజులపాటు బోనాలు, ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించను న్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున వారికి తాగునీరు, అన్నప్రసాదం, విశ్రాంతి సదుపాయాలు కల్పించారు. ఈ మహోత్సవాలను విజయవంతం చేయడానికి గౌడ సంఘం సభ్యులు కృషి చేస్తున్నారు. ఈ సందర్బంగా ముఖ్యంగా భక్తులకు ఎలాంటి అసౌ కర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని బుధవారం ఏర్పా టు చేసిన సమావేశంలో గౌడ సంఘం అధ్యక్షుడు రంగు ప్రభాకర్, ఉపా ధ్యక్షుడు వడ్లకొండ విజయ్ తెలిపారు. కులస్తులు రంగు ఎల్లయ్య, వడ్ల కొండ నర్సయ్య, మాచర్ల బిక్షపతి, రంగు రాజయ్య, రంగు కుమారస్వా మి, వడ్లకొండ చంద్రయ్య, అంజయ్య, ఉత్సవ కమిటీ అధ్యక్షులు మాచ ర్ల అశోక్, సభ్యులు రంగు యాకయ్య, వడ్లకొండ చిరంజీవి, కోతి అజ య్, రంగు వెంకటేష్, రంగు అనుఫ్ లు తదితరులు పాల్గొన్నారు. ఈ మహోత్సవాలకు బంధుమిత్రులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి, స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నారు.

Leave a Reply