Home Minister | నిందితులకు కఠిన శిక్ష తప్పదని హామీ..

Home Minister | నిందితులకు కఠిన శిక్ష తప్పదని హామీ..

Home Minister | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హత్యకు గురైన జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత ఫోన్‌లో పరామర్శించారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెబుతూ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

జగన్మోహన్ రెడ్డి సతీమణి గీతాంజలితో ఫోన్‌లో మాట్లాడిన హోంమంత్రి అనిత, అధైర్యపడవద్దని సూచించారు. ఈ ఘటనకు సంబంధించిన కేసు ఈరోజు సాయంత్రం లోపల ఒక కొలిక్కి వస్తుందని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై ప్రత్యేక చొరవ తీసుకున్నారని, నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కుటుంబానికి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. హోంమంత్రి అనితతో పాటు స్థానిక పలమనేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి కూడా ఫోన్‌లో బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.