అర్ధరాత్రి ఆకస్మిక తఖీలు

ప్రజల రక్షణ కోసం నిరంతర గస్తీ : ఎస్పీ
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రజల సంక్షేమం కోసం పోలీస్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ గస్తీ నిర్వహించాలని నన్ను కనుగుణంగా రాత్రి వేళల్లో కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎస్పి పేర్కొన్నారు.ఎస్పీ సునీల్ షొరాణ్ బుధవారం అర్ధరాత్రి సమయంలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టరు.జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా అర్ధరాత్రి పట్టణంలోని బొమ్మలసత్రం,రైల్వే స్టేషన్, నూనెపల్లి, సాయిబాబా నగర్, గవర్నమెంట్ హాస్పిటల్ పరిసర ప్రాంతాలలో,హరిజనవాడ రైల్వే ట్రాక్, ఆటోనగర్ మొదలగు ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

క్షేత్రస్థాయి పరిశీలన…
అర్ధరాత్రి వేళలో పట్టణంలోని ప్రధాన కూడళ్లు, అనుమానిత ప్రాంతాలు మరియు శివారు ప్రాంతాలను ఎస్పీ స్వయంగా సందర్శించి భద్రతా పరిస్థితులను సమీక్షించారు.చట్టవ్యతిరేక, అసాంఘిక పనులకు పాల్పడే వారిపై మరియు మాదకద్రవ్యాల పై నిఘా ఉంచుతూ రాత్రి వేళల్లో అనవసరంగా తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. నేరాల నియంత్రణలో భాగంగా విస్తృత తనిఖీలు చేపట్టడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.ప్రజలకు ఎలాంటి భయం లేకుండా పోలీసులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ రక్షణ కల్పించాలని అధికారులను ఆదేశించారు.
సిబ్బందికి దిశానిర్దేశం
విధుల్లో అలసత్వం వహించకూడదని, గస్తీని మరింత ముమ్మరం చేయాలని, క్షేత్రస్థాయిలో రౌడీ షీటర్లు, నేరచరిత్ర గల వారి కదలికలపై తనిఖీలు నిర్వహించాలని, ముఖ్యమైన ప్రాంతాలలో ఏర్పాటుచేసిన పాయింట్ లలో సంతకాలు చేయడంతో పాటు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ గస్తి నిర్వహించాలని అధికారులకు మరియు పోలీస్ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.
