4 DEAD : అర్ధరాత్రి …అక్కడికక్కడే Andhra Prabha News

4 DEAD : అర్ధరాత్రి …అక్కడికక్కడే Andhra Prabha News
- నలుగురు ప్రాణాలు గాలిలోకి..
- విజయనగరం జిల్లాలో కారు బీభత్సం
- పేరాపురం జంక్షన్ లో అదుపు తప్పిన కారు
- తొలుత పాదచారులు.. తరువాత లారీని ఢీకొన్న కారు
- ఇద్దరి పరిస్థితి విషమం..
- మహారాజా ఆసుపత్రికి తరలింపు
( ఆంధ్రప్రభ, విజయ నగరం బ్యూరో)
4 DEAD విజయనగరం జిల్లాలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఘోర దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఏప్రిల్ 27, 2026 (సోమవారం) అర్ధరాత్రి సుమారు 12:00 గంటల సమయంలో జాతీయ రహదారి-16 (NH-16) పై పూసపాటిరేగ మండలంలోని పేరాపురం జంక్షన్ సమీపంలో ఈ ఘోరం జరిగింది. విశాఖపట్నంలె బయలుదేరిన కారు శ్రీకాకుళం వైపు వెళ్తోంది. కారు డ్రైవరు వేగం పెంచటంతో పేరాపురం జంక్షన్ సమీపంలో రోడ్డు దాటుతున్న ఇద్దరు వ్యక్తులను బలంగా ఢీకొట్టింది. ఆ తర్వాత అదుపు తప్పి రహదారి పక్కన ఆగి ఉన్న ఒక లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
4 DEAD ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ఇద్దరు పాదచారులు, కారులోని డ్రైవర్ సహా మరో వ్యక్తి మృతి చెందారు. కాంట్రాక్టర్ శ్రీనివాస్, బొబ్బొలికి చెందిన మరో వ్యక్తి మృతి చెందారు. మిగిలిన మృతులను ఇంకా గుర్తించలేదు. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని విజయనగరం మహారాజా ఆసుపత్రికి తరలించారు.
