Telangana Cabinet | నేడు తెలంగాణ కేబినెట్ భేటీ

హైదరాబాద్ | తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరుగనుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో నేడు తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరుగనుంది. కాళేశ్వరం విజిలెన్స్, ఎన్ డి ఎస్ ఎ రిపోర్ట్ పై మంత్రివర్గ భేటీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండనుంది.

పవర్ కమిషన్ రిపోర్ట్, ఫోన్ ట్యాపింగ్, ఇతర ఎంక్వైరీలపైనా చర్చించే అవకాశం ఉంది. ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది.ఒకటి లేదా రెండు డీఏలపై ప్రకటన? ఉంటుంది. రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక, పథకం అమలుపై చర్చించి నిర్ణయించే అవకాశం ఉంది. వానాకాలం పంటల సాగు, రైతు భరోసాపైనా నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది. పలు పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించనుంది క్యాబినెట్.

Leave a Reply