సాయినాథా.. గెలిపించు

షిరిడీ సాయి ఆలయంలో హీరో విజయ్ పూజలు
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తమిళ అగ్ర కథానాయకుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ అధినేత విజయ్ ఇవాళ షిరిడీ సాయిబాబాను దర్శించుకున్నారు. బుధవారం ఉదయం విజయ్ షిరిడీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తిరుచెందూర్ సుబ్రమణ్యస్వామి ఆలయాన్ని సందర్శించిన మరుసటి రోజే ఆయన షిరిడీ చేరుకున్నారు. ఆయన ఉదయం సుమారు 10:30 గంటలకు బాబా దర్శనం చేసుకున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో ఆయన అత్యంత నిరాడంబరంగా, భక్తిశ్రద్ధలతో దర్శనంలో పాల్గొన్న దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి.


