ప్రజల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం

ప్రజల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం

  • కడెం తహసిల్దార్ ఖాజా మొయినుద్దీన్

కడెం, ఆంధ్రప్రభ: ఎండకాలం దృష్ట్యా వివిధ పనుల నిమిత్తం తహసిల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కడెం మండల తహసిల్దార్ ఖాజా మొయినుద్దీన్ కోరారు. సోమవారం కడెం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి తీవ్రత దృష్ట్యా దూర ప్రాంతాల నుండి వచ్చే ప్రజలకు, రైతులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ ఎం. లచ్చిరాం, సీనియర్ అసిస్టెంట్ ఎస్. గంగన్న, కార్యాలయ ఉద్యోగులు, జీపీఓలు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.