నూతన తహసీల్దార్ ను సన్మానించిన సర్వసమాజ్ కమిటీ

నూతన తహసీల్దార్ ను సన్మానించిన సర్వసమాజ్ కమిటీ
భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ భీమ్‌గల్ మండల తహసీల్దార్ గా ఇటీవలే నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కిరణ్ కుమార్ ను సోమవారం భీమ్‌గల్ పట్టణ సర్వసమాజ్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భీమ్‌గల్ తహసీల్దార్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానించారు. అనంతరం కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ.. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న అన్ని రకాల సమస్యలను పరిష్కరించుటకు శక్తివంచన లేకుండా కృషి చేస్తారని, ఆ భగవంతుడు మీకు శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్వసమాజ్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పతాని కృష్ణ, ఉపాధ్యక్షులు తీగల రఘు, కోశాధికారి ఎస్పీ భూమేశ్వర్, సలహా కమిటీ సభ్యులు నీలం జలంధర్, కూన రఘు, కొండూరు సంజీవ్, కొత్తాల చిన్ని, కర్నే గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
