నూతన తహసీల్దార్ కు ఘన సన్మానం

నూతన తహసీల్దార్ కు ఘన సన్మానం

కడెం, ఆంధ్రప్రభ: కడెం మండల నూతన తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన ఖాజా మొయినుద్దీన్ గారిని సోమవారం రేషన్ షాపు డీలర్ల సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో రేషన్ షాప్ డీలర్ల సంఘం మండల అధ్యక్షులు కె. రాజేశ్వర్, ఉపాధ్యక్షులు కే. లక్ష్మీ నరసయ్య ఆధ్వర్యంలో డీలర్లు ఆయనను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మండలంలో రేషన్ పంపిణీకి సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించారు. ఈ సన్మాన కార్యక్రమంలో కన్నాపూర్ గ్రామ సర్పంచ్ ఎం. శంకర్ తో పాటు రేషన్ షాప్ డీలర్లు షేక్ అజీజ్, కే. శ్రీనివాస్, కే. రాజమల్లు, డి. రాజశేఖర్, చందు, వెంకట్ రెడ్డి, ఆర్. సాయి రాజ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

నూతన తహసిల్దార్ కు ఘన సన్మానం