మృతదేహంతో మైక్రో ఫైనాన్స్ బాధితుల ఆందోళన
పెద్దవూర (ఆంధ్రప్రభ) : నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని పెద్దవూర పోలీస్ స్టేషన్ ఎదుట గల కోదాడ జడ్చర్ల హైవేపై ఇవాళ రమావత్ మధు.. బాలాజీ నాయక్ ల మైక్రో ఫైనాన్స్ బాధితులు ధర్నా చేశారు. పెద్దవూర మండలంలోని పాల్తీ తండాకు చెందిన రమేష్ అనే బాధితుడు ఇవాళ ఉదయం గుండెపోటుతో మృతిచెందాడు. రమేష్ మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట మైక్రోఫైనాన్స్ బాధితులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మైక్రో ఫైనాన్స్ మోసాలపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

