బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే బొజ్జపటేల్కు ఆహ్వానం
కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని చిన్న బెల్లాల్ గ్రామంలో ఈ నెల 26 నుండి 28 వరకు నిర్వహించనున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం 20వ వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలకు రావాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమా బొజ్జపటేల్ను గ్రామ సర్పంచ్ బొంతల లక్ష్మీ భూమన్న యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కడెం మాజీ జడ్పీటీసీ తక్కల రాధ, సత్యనారాయణ, నాయకులు గిరివేని సత్తన్న, కంటాల రవి, చెన్ను మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
